మన శరీరంలో జరిగే ప్రతి పనికి నీరు తప్పనిసరి అవసరం. ఆహారం లేకుండా కేవటం మంచి నీళ్లు తాగుతూ ఒక వ్యక్తి వారం రోజులపాటు బతకవచ్చు. అయితే, రాత్రి పడుకునే ముందు సరైన పరిమాణంలో, సరైన సమయంలో నీళ్లు తాగడం వల్ల ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. సాధారణంగా రాత్రిపూట నీళ్లు తాగడం దాదాపు అందరికీ అలవాటు. కానీ దాని వల్ల ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం..
ప్రతిరోజు రాత్రి నిద్రపోవడానికి ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే తిన్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు.
నీళ్లు రక్తప్రసరణను సమతుల్యం చేయడానికి హెల్ప్ చేస్తాయి. రాత్రిపూట నీళ్లు తాగితే హార్ట్ ఎటాక్ ప్రమాదం తగ్గుతుంది. ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు నీళ్లు తాగితే చర్మ కణాలకు తేమ కలుగుతుంది. చర్మం తాజాగా, అందంగా ఉంటుంది.
సరిపడా నీళ్లు తాగితే బాడీ హైడ్రేట్‌గా ఉండి మెదడు బాగా పనిచేస్తుంది. రాత్రి నీళ్లు తాగితే నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది. రోజు రాత్రి నిద్రపోవడానికి ముందు నీళ్లు తాగితే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. కీళ్ల నొప్పుల నుంచి ఈజీగా ఉపశమనం పొందవచ్చు.
రాత్రి నిద్రపోయే ముందు నీళ్లు తాగితే కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. వ్యర్థ పదార్థాలు తొలగిపోవడంతో కిడ్నీలో మలినాలు ఏర్పడకుండా ఉంటాయి. రాత్రి నిద్రపోవడానికి ముందు నీళ్లు తాగితే బరువు తగ్గడానికి హెల్ప్ అవుతుంది. బరువు తగ్గాలనుకునే వారు పడుకునే ముందు ఓ గ్లాస్ వాటర్ తాగడం మంచిది.
రాత్రిపూట నీళ్లు తాగితే కాలేయం డిటాక్స్ అవుతుంది. తద్వారా వ్యర్ధాలు బయటకు వెళ్లిపోతాయి. ఆరోగ్యంగా ఉంటారు. రాత్రిపూట నిద్రపోయే ముందు నీళ్లు తాగితే శరీర ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది. ముఖ్యంగా వేసవిలో తాగితే మంచిది. కానీ, రాత్రి పూట నీళ్లు మరీ ఎక్కువగా తాగటం కూడా మంచిది కాదు.