శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం : సూర్య ఘర్ ప్రాజెక్టుతో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఉచిత విద్యుత్


పుట్టపర్తి : పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని సత్యమ్మ దేవాలయం వద్ద పేద మధ్యతరగతి ప్రజలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూపర్ గిఫ్ట్ జిఎస్టి 2 అవగాహన సదస్సు సమావేశానికి జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ గారు, ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి గారు, మాజీమంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి గారు, విద్యుత్ ఎస్ ఈ సంపత్ కుమార్ గారు , పరిశ్రమల జిల్లా అధికారి నాగరాజా గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తగ్గిన జిఎస్టి ధరలతో నిత్యవసర సరుకులు కొనుగోలు చేయాలని ప్రజలకు సూచించారు. అదే విధంగా సూర్య ఘర్ సోలార్ పవర్ ఏర్పాటు చేసుకుంటే ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఉచిత విద్యుత్తుతో అందజేస్తామని తెలిపారు. బీసీలకు ప్రభుత్వం రూ.20వేలు సబ్సిడీ ఇస్తుందని తెలిపారు. ప్రతి ఇంటిపై సూర్య ఘర్ సోలార్ పవర్ ఏర్పాటు చేసుకోవాలని ప్రజలను కోరారు. అనంతరం సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై కరపత్రాలు పంపిణీ చేసి ప్రజలకు అవగాహన కల్పించారు.