ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలి

 తలుపుల అక్టోబర్ 31 (అమరావతి ఫ్లాష్):ఎ

నవంబరు 1న(శనివారం) శ్రీసత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం తలుపుల మండలం పెద్దన్నగారిపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను స్వయంగా లబ్ధిదారులకు పంపిణీ చేయడానికి  రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  విచ్చేస్తున్నందున కట్టుదిట్టమైన భద్రత  ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ పరిశీలించారు. అధికారులకు  సమన్వయంగా ప్రణాళికాబద్దంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్, జేసి మౌర్య భరద్వాజ్ లతో కలిసి తలుపుల మండలం పెద్దన్నగారిపల్లి గ్రామంలో హెలిపాడ్, ప్రజా వేదిక సభాస్థలి ప్రాంతాలలో మౌలిక వసతులను, మీడియా,విఐపి, గ్రామస్తులు మరియు మీడియా గ్యాలరీ మరియు పార్కింగ్ ప్రదేశాలలో  తీసుకోవాల్సిన జాగ్రత్తలు భద్రతపై అధికారులక తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు తగు సూచనలు చేశారు. అలాగే ముఖ్యమంత్రి  పర్యటించే ప్రదేశాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతాచర్యలు ఏర్పాటు చేయడంతో పాటు, ఉమ్మడి జిల్లా నుండి ప్రజా ప్రతినిధులు ప్రజలు ముఖ్యమంత్రి పర్యటనకు విచ్చేయనున్న సందర్భంగా ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని, వాహనాల పార్కింగ్ కొరకు అనువైన ప్రదేశాలను ఏర్పాటు చేసి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్, ఎస్పీ ఆదేశించారు. అనంతరం వివిధ అంశాలలో అధికారులతో సమీక్షించి తగు సూచనలు సలహాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవోలు, పంచాయతీరాజ్, ఆర్అండ్బి, డిఆర్డిఏ, డ్వామా, పంచాయతీ, వైద్య, వివిధ శాఖల జిల్లా అధికారులు, పోలీసు అధికారులు, మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.