మాచర్ల నియోజవర్గంలో జర్నలిస్ట్ పై టీడీపీ నాయకులు దాడి..


కారంపూడి (అమరావతి ఫ్లాష్) : కారంపూడిలో ఒక జర్నలిస్టుపై కర్రలతో దాడి చేసిన ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ప్రధాన అనుచరులు చప్పిడి రాము, చప్పిడి శీను, మునుగోటి సత్యం. కారంపూడి మండలంలో జరుగుతున్న అక్రమాల గురించి వార్తలు రాసినందుకు జర్నలిస్టు పై దాడి చేసిన బ్రహ్మారెడ్డి అనుచరులు. జర్నలిస్టు అలూరి లక్ష్మణరావు తలపై తీవ్రమైన గాయం. గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.  జర్నలిస్టు లక్ష్మణరావు పై తప్పుడు కేసు బనాయించడానికి ప్రయత్నిస్తున్న తెలుగుదేశం నాయకులు.

జర్నలిస్టు లక్ష్మణరావు కామెంట్స్..👇

తెలుగుదేశం నాయకుడు చప్పిడి రాము నాపై కర్రతో దాడి చేశాడు, నేను ఫిర్యాదు చేయడానికి కారంపూడి పోలీస్ స్టేషన్ కి వెళ్లాను, చప్పిడి శ్రీనుతో పాటు మరొకరు కత్తితో పోలీస్ స్టేషన్ కి వచ్చి నాపై దాడి చేయడానికి ప్రయత్నించారు..పోలీసులు అడ్డుకున్నారు, పోలీసు ఉన్నతాధికారులు కారంపూడి పోలీస్ స్టేషన్ లో సీసీ ఫుటేజ్ ను పరిశీలిస్తే తెలుగుదేశం పార్టీ నాయకుల దౌర్జన్యం ఎలా ఉందో తెలుస్తుంది, తెలుగుదేశం నాయకుల నుంచి నాకు ప్రాణహాని ఉంది నన్ను కాపాడండి.