*జిల్లా స్థాయి క్రీడలకు ఎంపికైన హరీష్ స్కూల్ విద్యార్థులు*
కదిరి రూరల్ అక్టోబర్ 31 (అమరావతి వెలుగు):-
మండల స్థాయి పోటీలలో పాల్గొన్న హరీష్ స్కూల్ విద్యార్థులు జిల్లా స్థాయి క్రీడ పోటీలకు ఎంపికైనట్టు ప్రిన్సిపాల్ ఎం ఎస్ కిరణ్, వ్యాయామ ఉపాధ్యాయులు ఖాదర్ వలీ పేర్కొన్నారు. కదిరి పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాల డిగ్రీ కళాశాల మైదానంలో ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో వారం రోజులు పాటు నిర్వహించిన క్రీడల్లో హరీష్ స్కూల్ విద్యార్థులు ప్రతిభను కనబరిచి జిల్లాస్థాయి క్రీడలకు ఎంపికయ్యారు. విద్యార్థులు ప్రతిభ కనబరిచిన వారిలో షటిల్ పోటీల్లో నరసింహమూర్తి, మనోజ్ కుమార్, బాలికల విభాగంలో హృతిక, వాలీబాల్ లో నరేంద్ర యాదవ్, ఖోఖో లో మనోజ్, మోక్షిత్, 400 మీటర్ రిలే లో ప్రీతమ్ సింగ్, 400 మీటర్లు పరుగు పందెంలో నరేంద్ర యాదవ్, షాట్ పుట్ లో మోక్షిత్ నాయక్ లు ఎంపికైనట్లు వివరించారు. ఎంపికైన విద్యార్థులు రేపు (నేడు) జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొనాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
