ఒంటి నిండా బొబ్బలతో చిన్నారికి వింత వ్యాధి..! ఎన్టీఆర్, ఖమ్మం జిల్లాల్లో కలకలం..

ఉమ్మడి కృష్ణా జిల్లాలో వింత వ్యాధి ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో చిన్నారికి వింత వ్యాధి సోకింది.. ఒంటి నిండా బొబ్బలతో చిన్నారి అవస్థలు పడుతూ.. అల్లాడిపోయింది.. అయితే.. చిన్నారికి వైరస్ వ్యాధి సోకిందని ప్రచారం జరుగుతుండటంతో.. వెంటనే స్పందించిన జిల్లా అధికారులు చిన్నారికి చికిత్స అందించారు.

ఒంటి నిండా బొబ్బలతో చిన్నారికి వింత వ్యాధి..! ఎన్టీఆర్, ఖమ్మం జిల్లాల్లో కలకలం..

ఉమ్మడి కృష్ణా జిల్లాలో వింత వ్యాధి ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో చిన్నారికి వింత వ్యాధి సోకింది.. ఒంటి నిండా బొబ్బలతో చిన్నారి అవస్థలు పడుతూ.. అల్లాడిపోయింది.. అయితే.. చిన్నారికి వైరస్ వ్యాధి సోకిందని ప్రచారం జరుగుతుండటంతో.. వెంటనే స్పందించిన జిల్లా అధికారులు చిన్నారికి చికిత్స అందించారు. అయితే.. వైద్యం తర్వాత చిన్నారికి ఇన్ఫెక్షన్ తగ్గినట్లు వైద్యులు తెలిపారు. అపోహలు నమ్మవద్దని సూచించారు. అంతేకాకుండా.. అధికారులు  గ్రామంలో పర్యటించి వివరాలు సేకరించారు.

జీజీఎహెచ్ లో చికిత్స..

చిన్నారికి ఇన్ఫెక్షన్ రావడంపై ఉన్నతాధికారుల ఆరా తీశారు. విజయవాడ GGH‌కి తరలించి పరీక్షలు చేసినట్లు తెలిపారు. అంతేకాకుండా.. గ్రామంలో వైద్య సిబ్బంది ఇంటింటి సర్వే చేస్తున్నారు.. గ్రామంలో ఇంకా ఎవరికైనా ఇన్ఫెక్షన్ సోకిందేమోనని పరిశీలిస్తున్నారు.

చిన్నారికి సోకిన ఇన్ఫెక్షన్‌పై ఆందోళన చెందవద్దని అధికారుల సూచించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని పెనుగంచిప్రోలు ప్రజలను కోరారు. దీనిలో భాగంగా పారిశుధ్య సిబ్బంది.. బ్లిచింగ్ పౌడర్ తో శానిటైజేషన్ చేస్తున్నారు.

ఖమ్మం వెళ్లి వచ్చాక..

ఇదిలాఉంటే.. ఖమ్మం జిల్లా గార్లలో జరిగిన ఫంక్షన్‌కి వెళ్లివచ్చాక చిన్నారికి ఇన్ఫెక్షన్ సోకిందని బంధువులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అపోహలు నమ్మొద్దని, ఆందోళన చెందవద్దని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని అధికారుల సూచించారు.