టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మరోసారి తన గొప్ప మనసును చాటుకుంది. తన ప్రత్యూష ఫౌండేషన్ లో ఉన్న పిల్లలతో కలిసి దీపావళి పండగను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది. అనంతరం ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
దేశమంతా దీపావళి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అందరూ తమ కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులతో కలిసి ఈ పండగను సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
తాజాగా సమంత ‘ప్రత్యూష’ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన దీపావళి వేడుకల్లో పాల్గొంది. అక్కడ చికిత్స పొందుతోన్న పేద పిల్లలతో కలిసి పండగను సెలెబ్రేట్ చేసుకుంది.
ఈ సందర్భంగా చిన్నారులందరికీ గిఫ్ట్ లు కూడా అందజేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన సామ్ నిన్నటి సాయంత్రం చాలా ఆనందంగా గడిచిందని ఎమోషనలైంది.