ఒక ప్రయాణీకుడు సమోసా విక్రేత వద్దకు తొందరపడి రెండు సమోసాలు కొన్నాడు. అతను వాటిని త్వరగా తిని కదులుతున్న రైలు ఎక్కడానికి ప్రయత్నించాడు. కానీ సమోసా విక్రేత అతన్ని గట్టిగా పట్టుకున్నాడు. ఇంతలోనే రైలు కదలడం మొదలైంది. ఇంతలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఇది చూసి ప్రయాణీకులు షాక్ అయ్యారు.
ఈ వీడియో ప్లాట్‌ఫారమ్‌పై ఆగి ఉన్న రైలు వద్ద జరిగినట్లు తెలుస్తోంది. ఒక ప్రయాణీకుడు సమోసా విక్రేత వద్దకు తొందరపడి రెండు సమోసాలు కొన్నాడు. అతను వాటిని త్వరగా తిని కదులుతున్న రైలు ఎక్కడానికి ప్రయత్నించాడు. కానీ సమోసా విక్రేత అతన్ని గట్టిగా పట్టుకున్నాడు. ప్రయాణీకుడు ఆన్‌లైన్‌లో చెల్లిస్తానని చెప్పి లావాదేవీని పూర్తి చేయడానికి తన మొబైల్ ఫోన్‌ను బయటకు తీశాడు. ఇంతలో, నెట్‌వర్క్ సమస్య కారణంగా, చెల్లింపు విఫలమైంది. అప్పుడే అసలు కథ మొదలైంది.
చెల్లింపు జరగకపోవడంతో సమోసా విక్రేత కోపంతో రగిలిపోయాడు. అతను ప్రయాణీకుడిని దుర్భాషలాడుతూ.. కోపంగా అతని కాలర్ పట్టుకున్నాడు. సమోసా విక్రేత ప్రయాణీకుడిని “డబ్బు చెల్లించండి లేదా ఏదైనా వదిలివేయండి” అని అంటూ బూతులు తిడుతున్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపించింది. ఈ పరిస్థితి దిగజారడంతో ఈ ఘటన చూస్తున్న వారంతా ఖంగుతిన్నారు. నెట్‌వర్క్ పనిచేయడం లేదని, చెల్లింపు జరుగుతుందని అతను వివరించడానికి ప్రయత్నించాడు. కానీ సమోసా విక్రేత వినడానికి నిరాకరించాడు. డబ్బులు వస్తేనే కదలంటూ గట్టిగా పట్టుకున్నాడు.
తరువాత ఏం జరిగిందో అందరి దృష్టిని ఆకర్షించింది. సమోసా అమ్మే వ్యక్తి ప్రయాణీకుడి మణికట్టు నుండి స్మార్ట్ వాచ్ తీసివేసి, “నువ్వు డబ్బు చెల్లించిన తర్వాత దాన్ని తిరిగి తీసుకో” అంటూ లాక్కున్నాడు. ఆ తర్వాత అతను అతనికి రెండు ప్లేట్ల సమోసాలు అందజేసి, “ఇప్పుడు వెళ్ళు, రైలు బయలుదేరుతోంది” అని అన్నాడు. అయితే అప్పటికే రైలు కదలడం ప్రారంభించింది. చివరికీ చేసేదీ లేక చేతిలో సమోసాలు పట్టుకున్న ప్రయాణీకుడు రైలు ఎక్కి వెళ్లిపోయాడు.