ధర్మకర్త ప్రమాణస్వీకారం.

 విజయవాడ, అక్టోబర్ 17 :దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యురాలిగా పద్మావతి శుక్రవారం మధ్యాహ్నం ప్రమాణస్వీకారం చేశారు.ఆలయ ఈవో వి. కె. శీనా నాయక్ మహా మంటపంలో గల కార్యాలయంలో ప్రమాణం చేయించారు.ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ,మాజీ శాసన సభ్యులు ఎస్. ఉదయభాను, ధర్మకర్తల మండలి సభ్యులు రాఘవ రాజు, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.