- ధరలపై నియంత్రణ లేకపోవడంతో మండుతున్న సామాన్యుల ఆవేదన.!
- దీపావళి వెలుగుల వెనుక చీకటి – అధికారుల నిర్లక్ష్యంతో మండుతున్న ప్రజల ఆవేదన!
నార్పల మండలం, అక్టోబర్ 21 (అమరావతి ఫ్లాష్) : దీపావళి ఆనందం కంటే ఆవేదన ఎక్కువైపోయింది.టపాసుల ధరలు ఆకాశాన్ని అంటు తుండగా,అధికారుల నిర్లక్ష్యం ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి దారి తీస్తోంది. మండలంలోని ఆరు టపాసుల షాపులు పంచాయతీ పరిధిలో ప్రైవేట్ ప్లాట్లలో బాడుగకు నిర్వహించబడుతున్నా — ఎక్కడా ధరల పట్టికలు కనబడడం లేదు. వినియోగదారులు ఎంత అడిగినా “ధరలు ఫిక్స్ అయ్యాయి” అనే సమాధానం తప్ప మరొకటి రాకుండా ఉంది.
పోలీస్, రెవెన్యూ, ఫైర్ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ చేయాల్సి ఉన్నా — చూస్తూ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఫైర్ సేఫ్టీ పరికరాలు ఉన్నా కనపడనట్లు అవి నామకేవాస్తుగా ఏదో ప్రజలకు కనపడేటట్లు ఒక డ్రమ్ము నీళ్లు మాత్రమే పెట్టుకొని షాపులు నడుస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. విశ్వసనీయ సమాచారం ప్రకారం, కొంతమంది అధికారులు షాపుల నుండి టపాసులు తీసుకెళ్లడమే తప్ప నియంత్రణ చర్యలు తీసుకోలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రమాదాలు జరిగితే కానీ స్పందించరా అన్నట్లుగా అధికారులు మౌనంగా ఉన్నారు. అధిక ధరలతో అమ్మకాలు జోరుగా కొనసాగుతుండడంతో పేద ప్రజలు టపాసులు కొనలేక నిరాశ చెందుతున్నారు. చిన్నారులకు దీపావళి ఉత్సాహం మాయమైపోగా,తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
“పత్రిక ప్రకటనల్లో మాత్రమే ధరలు చూపించి, క్షేత్రస్థాయిలో ఎవరూ తనిఖీలు చేయడం లేదు” అని స్థానికులు మండి పడుతున్నారు. ఆర్డీవో, డీఎస్పీ, సీఐ, ఎస్సై, ఫైర్ అధికారులు కనీసం ఒకసారి అయినా షాపుల వద్దకు వచ్చి పరిస్థితిని పరిశీలించాలంటూ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.